Wednesday, October 23, 2019

మనోవికాస యోగసాధన-నిధి

మనోవికాసయోగ సాధన మరియు మానవతా విలువలతో కూడిన సేవలు సాధకులతోబాటు ఇతరులు కూడా ఉన్నత శిఖరాలను చేరడానికి సహకరిస్తాయి.

ఆజ్ఞా, తురియం మరియు శాంతి ధ్యానాలను ప్రతిరోజూ రెండుపూటలా క్రమం తప్పకుండా, శ్రద్ధగా చేసినట్లయితే మనోబలం, చిత్తశాంతి, ఏకాగ్రతను పొందగల్గుతాము.

ఆలోచనల విశ్లేషణ లాంటి ఆత్మ పరిశీలనను క్రమంతప్పకుండా చేసినట్లయితే నిరంతర ఎఱుక, మంచి చెడు విచక్షణా జ్ఞానం కల్గుతుంది.  పాపపు ముద్రలు తుడిచిపెట్టుకుపోతాయి.

కోరికలను నీతివంతం చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం, కీర్తి, సంతృప్తి మరియు అభివృద్ధి కల్గుతాయి. ఎల్లవేళలా శాంతియుతంగా ఉండగలము.

క్రోధాన్ని తటస్థీకరిస్తే బంధుమిత్రులతో, కుటుంబ సభ్యులతో, సహచరులతో ప్రేమ, గౌరవంతో కూడిన సంబంధబాంధవ్యాలు పెంపొందుతాయి.

చింతల నిర్మూలన సాధన చేస్తే అనవసర భయాలు తొలగి ఆరోగ్యము మరియు సంతృప్తి లభిస్తాయి.

“నేనెవరు?” అనే ప్రశ్నను లోతుగా విశ్లేషిస్తే విశ్వానికావల నున్న సత్యము, దాని ఉనికి, అది పనిచేసే విధానము, తత్ ప్రభావము స్పష్టంగా గోచరిస్తుంది. దృగ్గోచరమవని మనస్సు, ప్రాణశక్తి మరియు బ్రహ్మము గురించిన రహస్యపరిజ్ఞానము స్పష్టంగా విదితమవుతుంది.

ఈ సాధనలన్నీ విలువలతో కూడిన జీవన విద్యలో అంతర్భాగమే. మీలోప్రతి ఒక్కరు ఈ విద్యను సులభంగా నేర్చుకుని సాధన చేయగలరు.

సాధనతో సంతృప్తి, సఫలత్వం కల్గి జీవిత లక్ష్యాన్ని సాధించగలరు. మనోవికాస యోగసాధన ఎంతో ఆదర్శవంతమైన విధానం.


-తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి